అంకెలు

6:42 PM Posted In , Edit This 0 Comments »



ఒక్కటి ఓ చెలియా
రెండు రోకళ్ళు
మూడు ముచ్చిలకా
నాలుగు నందన్నా
ఐయిదుం బేడల్లు
ఆరుం జివ్వాజి
ఏడు ఎలమంద
ఎనిమిది మనమంద
తిమ్మిది తోకుచ్చు.

ఎందుకురా ?

6:41 PM Posted In , Edit This 0 Comments »


ఎండలు కాసేదెందుకురా ?

మబ్బులు పట్టేటందుకురా.

మబ్బులు పట్టేదెందుకురా ?

వానలు కురిసేటందుకురా.

వానలు కురిసేదెందుకురా ?

చెరువులు నిండేటందుకురా.

చెరువులు నిండేదెందుకురా ?

పంటలు పండేటందుకురా.

పంటలు పండేదెందుకురా ?

ప్రజలు బ్రతికేటందుకురా.
ప్రజలు బ్రతికేదెందుకురా ?

దేవుని కొలిచేటందుకురా.

దేవుని కొలిచేదెందుకురా ?

ముక్తిని పొందేటందుకుర.

చుట్టాల సురభి

6:36 PM Posted In , Edit This 0 Comments »

చుట్టాల సురభి - బొటన వ్రేలు

కొండేల కొరవి - చూపుడు వ్రేలు

పుట్టు సన్యాసి - మధ్య వ్రేలు

ఉంగరాల భోగి - ఉంగరపు వ్రేలు

పెళ్ళికి పెద్ద - చిటికెన వ్రేలు

తిందాం తిందాం ఒక వేలూ -
ఎట్లా తిందాం ఒక వేలూ -
అప్పుచేసి తిందాం ఒక వేలూ -
అప్పెట్టా తీరుతుంది ఒక వేలూ -
ఉన్నాడు కదా ఒక వేలూ -
పొట్టివాడు గట్టి వాడు బొటనవేలు.

మాబడి

6:11 PM Edit This 0 Comments »

అదిగోనండీ మాబడి
నేర్పును మాకు చక్కని నడవడి
శ్రద్దగ చదువులు చదివెదమండి
చక్కగ కలిసి ఉంటామండి.


పాఠాలెన్నో చదివామండి
పంచతంత్రం విన్నామండి
అందులోన నీతి తెలిసిందండి
ఎప్పుడు తప్పులు చేయం లెండి.


చక్కగ బుద్దిగ ఉంటామండి
మంచి పనులు చేస్తామండి
కలసి అందరం ఉంటామండి
ఆనందంగా జీవిస్తామండి.


తగవులు ఎప్పుడు పడమింకండి
కలసి కట్టుగా ఉంటామండి
కలసి మెలసి పనిచేస్తామండి
కంచుకోట నిర్మిస్తామండి.


కోటకు జెందా కడ్తామండి
ఆకాశాన ఎగరేస్తామండి
ఆ ఎగిరే జెండా మాదేనండి
అదే మా భారత జెండా సుమండి.

అ ఆ లు దిద్దుదాము

6:06 PM Edit This 0 Comments »


అ ఆ లు దిద్దుదాము - అమ్మమాట విందాము
ఇ ఈ లు చదువుదాము-ఈశ్వరుని కొలుద్దాము
ఉ ఊ లు దిద్దుదాము - ఉడుతలను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ - అందరనూ పిలుద్దాము
ఒ ఓ ఔ అంటూ - ఓనమాలు దిద్దుదాము
అం అః అంటూ - అందరమూ ఆడుదాము


గురువుగారు చెప్పిన పాఠాలు విందాము
మామగారు చెప్పిన మంచి పనులు చేద్దాము
తాతగారు చెప్పిన నీతి కధలు విందాము
అందరం కలుద్దాం ఆనందంగా ఉందాం.

తారంగం తారంగం

2:00 PM Edit This 2 Comments »



తారంగం తారంగం - తాండవకృష్ణా తారంగం !

అల్లరికృష్ణా తారంగం - పిల్లల కృష్ణా తారంగం !!


ముద్దుల కృష్ణా తారంగం - మురిపాలకృష్ణా తారంగం !

మధవ కృష్ణా తారంగం - యశోదకృష్ణా తారంగం !!


వేణునాధా తారంగం - వెంకటరమణా తారంగం !

రాధాకృష్ణా తారంగం - రమణీకృష్ణా తారంగం !!


గోపాలకృష్ణా తారంగం - గోకులనాధా తారంగం !

వెన్నలదొంగా తారంగం - చిన్నికృష్ణా తారంగం !!


చిన్మయరూపా తారంగం - చిద్విలాసా తారంగం !

విశ్వమంతయు తారంగం - నీవేనయ్యా తారంగం !!.

పసిడి పలుకులు.

1:39 PM Edit This 1 Comment »

అల్లీ బిల్లీ

10:53 AM Edit This 3 Comments »



కొండాపల్లి కొయ్యాబొమ్మా !
నీకోబొమ్మా, నాకోబొమ్మా !

నక్కాపల్లీ లక్కాపిడతలు !
నీకో పిడతా, నాకో పిడతా !

నిర్మలపట్నం బొమ్మల పలకలు !
నీకో పలకా, నాకో పలకా !

బంగినపల్లీ మామిడిపండ్లూ !
నీకో పండూ, నాకో పండూ!

ఇస్తానుండూ తెచ్చేదాకా !
చూస్తూ ఉండూ ఇచ్చేదాకా.

చందమామ

5:57 PM Edit This 0 Comments »



చందమామ రావే - జాబిల్లి రావే
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలక్కి రావే - చాకిలెట్లు తేవే
పడవమీద రావే - పట్టుతేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడరావే - పాలు పెరుగు తేవే
మంచి మనసుతో రావే - ముద్దులిచ్చి పోవే
అన్నియును తేవే - మా అబ్బయి/అమ్మాయికీయవే

చిలకమ్మ పెండ్లి.

5:08 PM Edit This 0 Comments »


చిలకమ్మ పెండ్లి అని - చెలెకత్తెలందరూ-
చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు-
పందిట పిచ్చుకలు - సందడి చేయగ-
కాకుల మూకలు - బాకాలూదగ-
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగ-
కొక్కొరోకోయని - కోడి కూయగా-
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ-
కుహు కుహుయని కోయిల పాడగా-
పిల్ల తెమ్మెరలు - వేణువులూదగ-
నెమలి సొగసుగా - నాట్యం చేయగ-
సాలీడిచ్చిన చాపు కట్టుకొని-
పెండ్లి కుమారుడు బింకము చూపగ-
మల్లె మాలతి - మాదవీ లతలు-
పెండ్లి కుమారును - పెండ్లి కుమార్తెను-
దీవిస్తూ తమ పువ్వులు రాల్చగ-
మైనా గోరింక మంత్రము చదివెను-
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతు-
చిలకమ్మ మెడకట్టె - చింతాకు పుస్తె.

చిన్నారి

12:55 PM Edit This 0 Comments »


చిన్నారి మా పాప శ్రీముఖము చూసి.
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు.

పందిట్లొ అమ్మాయి పాకుతూ ఉంటే.
పనసపండని జనులు పరుగులెత్తేరు.

దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటేను.
దోసపండని జనులు దోసిలొగ్గేరు.

నీలాలు కెంపులు నిలువు వజ్రాలు.
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట.

పగడాలు రత్నాలు పారిజాతాలు.
పడలి మా అమ్మాయి పనిచేయుచోట.

చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు.
అందరికి మా అమ్మి అల్లారు ముద్దు.