
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నెయ్యి
గుప్పెడు తింటే కులుకులాడి
నడుమూ గట్టె నామాటే చిట్టీ
దూ దూ పుల్ల దూరాయ్ పుల్ల
చూడాకుండా జాడా తీయ్యి
దాగుడు మూతా దండాకోర్
పిల్లీ వచ్చే ఎలకా భద్రం - ఎక్కడి దొంగలక్కడే గప్ చుప్
2 comments:
చాలా బావుంది. ఇదివరకు ఒకసారి గ్రంధాలయంలో ఒక పుస్తకం చుసాను. ఇలాగే తెలుగు పద్యాలు, పల్లెపాటలు, జాతీయాలు సేకరించి పొందుపరిచారందులో. అప్పట్లో అలాంటి పుస్తకం కొనివుంటే బావుండేది అనిపిస్తోంది ఇప్పుడు. మీ దగ్గర ఇంకా ఇలాంటివి వుంటే ప్రచురించండి.
చాల బాగుంది. బాల్యన్ని గుర్తు చేసారు.
Post a Comment