రింగురింగు బిళ్ళ

5:18 PM Posted In , Edit This 0 Comments »రింగురింగు బిళ్ళ - రూపాయి దండ

దండ కాదురా - తామర మొగ్గ

మొగ్గ కాదురా - మోదుగ నీడ

నీడ కాదురా - నిమ్మల బావి

బావి కాదురా - బచ్హలి కూర

కూర కాదురా - కుమ్మరి మెట్టు

మెట్టు కాదురా - మేదర సిబ్బి

సిబ్బి కాదురా - చీపురు కట్ట

కట్ట కాదురా - కావడి బద్ద

బద్ద కాదురా - బారెడు మీసం

మీసం కాదురా మిరియాల పొడుం

పొడుంకాదురా - పోతురాజు.

రంగులు

2:05 PM Posted In , Edit This 0 Comments »చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు
మల్లెపువ్వు తెలుపు - మంచి మనసు తెలుపు


మందారం ఎరుపు - సిందూరం ఎరుపు

మంకెన పువ్వు ఎరుపు - మంచి మంట ఎరుపు


జీడి గింజ నలుపు - కట్టె బొగ్గు నలుపు

కారు చీకటి నలుపు - కాకమ్మ నలుపు


చామంతి పసుపు - పూబంతి పసుపు

బంగారం పసుపు - గన్నేరు పసుపు


సన్నజాజి తెలుపు

చామంతి పసుపు

మందారం ఎరుపు

కోకిలమ్మ నలుపు...

వెలుగు

1:55 PM Posted In , Edit This 0 Comments »

గోరంత దీపము కొండంత వెలుగు

మా ఇంటి పాపాయి మాకంటి వెలుగు

వెచ్చని సూరీడు పగలంత వెలుగు

చల్లని చంద్రుడు రాత్రంత వెలుగు

ముత్యమంత పసుపు ముఖమంత వెలుగు

ముత్తైదు కుంకుమ బ్రతుకంత వెలుగు

గురువు మాట వింటే గుణమంత వెలుగు

మంచి చదువులు నీకు భవిషత్తు వెలుగు"

కాళ్ళ గజ్జ - కంకాలమ్మ

12:54 PM Posted In , Edit This 1 Comment »

కాళ్ళ గజ్జ - కంకాలమ్మ
వేగు చుక్క - వెలగ మొగ్గ
మొగ్గగాదు - మోదుగ నీరు
నీరు కాదు - నిమ్మలవాయ
వాయకాదు - వాయింట కూర
కూర కాదు - గుమ్మడి పండు
పండు కాదు - పాపడ మీసం
మీసం కాదు - మిరియాల పోతు
పోతుకాదు - బొమ్మల శెట్టి
శెట్టి కాదు - శామ మన్ను
మన్ను కాదు - మంచి గంధపు చెక్క
లింగు లిటుకు - పందెమాల పటుకు
కాలు పండినట్లు - కడకు దీసి పెట్టు.