బుజ్జిమేక

11:42 AM Posted In , Edit This 0 Comments »

బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి ?
రాజుగారి తోటలోన మేతకెల్తిని.

రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?
రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని

పూల చెట్లు చూసి నీవు ఊరుకొంటివా ?
నోరూరగ పూల చెట్లు మేసి వస్తిని.

మేసి వస్తె నిన్ను భటులు ఏమి చేసిరి ?
భటులు వచ్చి నా కాళ్ళు విరగకొట్టిరి.

కాలు విరిగి నీవు ఊరుకొంటివా ?
మందుకోసం డాక్టరుగారింటికెల్తిని.

మందు ఇచ్హిన డాక్టరుకు ఏమి ఇస్తివి ?
చిక్కనైన తెల్లపాలు ఇచ్చి వస్తిని.

డాక్టరుకు పాలిచ్చి ఇంటి వద్ద ఏమిస్తావు ?
గడ్డి తినక ఒక పూట పస్తులుండి తీరుస్తా.

పస్తులుండి నీకు నీరసం రాదా ?
పాడు పనులు చేయనింక బుద్దివచ్చెనాకు

0 comments: