బుజ్జిమేక
11:42 AM Posted In పాటలు. , బాలల గీతాలు Edit This 0 Comments »బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి ?
రాజుగారి తోటలోన మేతకెల్తిని.
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?
రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని
పూల చెట్లు చూసి నీవు ఊరుకొంటివా ?
నోరూరగ పూల చెట్లు మేసి వస్తిని.
మేసి వస్తె నిన్ను భటులు ఏమి చేసిరి ?
భటులు వచ్చి నా కాళ్ళు విరగకొట్టిరి.
కాలు విరిగి నీవు ఊరుకొంటివా ?
మందుకోసం డాక్టరుగారింటికెల్తిని.
మందు ఇచ్హిన డాక్టరుకు ఏమి ఇస్తివి ?
చిక్కనైన తెల్లపాలు ఇచ్చి వస్తిని.
డాక్టరుకు పాలిచ్చి ఇంటి వద్ద ఏమిస్తావు ?
గడ్డి తినక ఒక పూట పస్తులుండి తీరుస్తా.
పస్తులుండి నీకు నీరసం రాదా ?
పాడు పనులు చేయనింక బుద్దివచ్చెనాకు
రాజుగారి తోటలోన మేతకెల్తిని.
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?
రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తిని
పూల చెట్లు చూసి నీవు ఊరుకొంటివా ?
నోరూరగ పూల చెట్లు మేసి వస్తిని.
మేసి వస్తె నిన్ను భటులు ఏమి చేసిరి ?
భటులు వచ్చి నా కాళ్ళు విరగకొట్టిరి.
కాలు విరిగి నీవు ఊరుకొంటివా ?
మందుకోసం డాక్టరుగారింటికెల్తిని.
మందు ఇచ్హిన డాక్టరుకు ఏమి ఇస్తివి ?
చిక్కనైన తెల్లపాలు ఇచ్చి వస్తిని.
డాక్టరుకు పాలిచ్చి ఇంటి వద్ద ఏమిస్తావు ?
గడ్డి తినక ఒక పూట పస్తులుండి తీరుస్తా.
పస్తులుండి నీకు నీరసం రాదా ?
పాడు పనులు చేయనింక బుద్దివచ్చెనాకు
రింగురింగు బిళ్ళ
5:18 PM Posted In పాటలు. , బాలల గీతాలు Edit This 0 Comments »రింగురింగు బిళ్ళ - రూపాయి దండ
దండ కాదురా - తామర మొగ్గ
మొగ్గ కాదురా - మోదుగ నీడ
నీడ కాదురా - నిమ్మల బావి
బావి కాదురా - బచ్హలి కూర
కూర కాదురా - కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా - మేదర సిబ్బి
సిబ్బి కాదురా - చీపురు కట్ట
కట్ట కాదురా - కావడి బద్ద
బద్ద కాదురా - బారెడు మీసం
మీసం కాదురా మిరియాల పొడుం
పొడుంకాదురా - పోతురాజు.
దండ కాదురా - తామర మొగ్గ
మొగ్గ కాదురా - మోదుగ నీడ
నీడ కాదురా - నిమ్మల బావి
బావి కాదురా - బచ్హలి కూర
కూర కాదురా - కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా - మేదర సిబ్బి
సిబ్బి కాదురా - చీపురు కట్ట
కట్ట కాదురా - కావడి బద్ద
బద్ద కాదురా - బారెడు మీసం
మీసం కాదురా మిరియాల పొడుం
పొడుంకాదురా - పోతురాజు.
రంగులు
2:05 PM Posted In పాటలు. , బాలల గీతాలు Edit This 0 Comments »
మల్లెపువ్వు తెలుపు - మంచి మనసు తెలుపు
మందారం ఎరుపు - సిందూరం ఎరుపు
మంకెన పువ్వు ఎరుపు - మంచి మంట ఎరుపు
జీడి గింజ నలుపు - కట్టె బొగ్గు నలుపు
కారు చీకటి నలుపు - కాకమ్మ నలుపు
చామంతి పసుపు - పూబంతి పసుపు
బంగారం పసుపు - గన్నేరు పసుపు
సన్నజాజి తెలుపు
చామంతి పసుపు
మందారం ఎరుపు
కోకిలమ్మ నలుపు...
కాళ్ళ గజ్జ - కంకాలమ్మ
12:54 PM Posted In పాటలు. , బాలల గీతాలు Edit This 1 Comment »కాళ్ళ గజ్జ - కంకాలమ్మ
వేగు చుక్క - వెలగ మొగ్గ
మొగ్గగాదు - మోదుగ నీరు
నీరు కాదు - నిమ్మలవాయ
వాయకాదు - వాయింట కూర
కూర కాదు - గుమ్మడి పండు
పండు కాదు - పాపడ మీసం
మీసం కాదు - మిరియాల పోతు
పోతుకాదు - బొమ్మల శెట్టి
శెట్టి కాదు - శామ మన్ను
మన్ను కాదు - మంచి గంధపు చెక్క
లింగు లిటుకు - పందెమాల పటుకు
కాలు పండినట్లు - కడకు దీసి పెట్టు.
వేగు చుక్క - వెలగ మొగ్గ
మొగ్గగాదు - మోదుగ నీరు
నీరు కాదు - నిమ్మలవాయ
వాయకాదు - వాయింట కూర
కూర కాదు - గుమ్మడి పండు
పండు కాదు - పాపడ మీసం
మీసం కాదు - మిరియాల పోతు
పోతుకాదు - బొమ్మల శెట్టి
శెట్టి కాదు - శామ మన్ను
మన్ను కాదు - మంచి గంధపు చెక్క
లింగు లిటుకు - పందెమాల పటుకు
కాలు పండినట్లు - కడకు దీసి పెట్టు.