అల్లీ బిల్లీ

10:53 AM Edit This 3 Comments »కొండాపల్లి కొయ్యాబొమ్మా !
నీకోబొమ్మా, నాకోబొమ్మా !

నక్కాపల్లీ లక్కాపిడతలు !
నీకో పిడతా, నాకో పిడతా !

నిర్మలపట్నం బొమ్మల పలకలు !
నీకో పలకా, నాకో పలకా !

బంగినపల్లీ మామిడిపండ్లూ !
నీకో పండూ, నాకో పండూ!

ఇస్తానుండూ తెచ్చేదాకా !
చూస్తూ ఉండూ ఇచ్చేదాకా.

3 comments:

yadavalli vsn sharma said...

మిత్రమా..
పాట అదిరింది..

వింజమూరి విజయకుమార్ said...

నిజంగానే చిన్నారి బ్లాగుకి అతికింది. అదిరింది.ఇటువంటివి మీ దగ్గర మరిన్ని వుంటే ప్రజంట్ చేయండి పిల్లలకి నేర్పించడానికి చక్కగా ముచ్చటగా వుంటాయి. కృతజ్ఞతలతో

Budaraju Aswin said...

కాని ఎక్కడొ విన్నట్టుందే.