మాబడి

6:11 PM Edit This 0 Comments »

అదిగోనండీ మాబడి
నేర్పును మాకు చక్కని నడవడి
శ్రద్దగ చదువులు చదివెదమండి
చక్కగ కలిసి ఉంటామండి.


పాఠాలెన్నో చదివామండి
పంచతంత్రం విన్నామండి
అందులోన నీతి తెలిసిందండి
ఎప్పుడు తప్పులు చేయం లెండి.


చక్కగ బుద్దిగ ఉంటామండి
మంచి పనులు చేస్తామండి
కలసి అందరం ఉంటామండి
ఆనందంగా జీవిస్తామండి.


తగవులు ఎప్పుడు పడమింకండి
కలసి కట్టుగా ఉంటామండి
కలసి మెలసి పనిచేస్తామండి
కంచుకోట నిర్మిస్తామండి.


కోటకు జెందా కడ్తామండి
ఆకాశాన ఎగరేస్తామండి
ఆ ఎగిరే జెండా మాదేనండి
అదే మా భారత జెండా సుమండి.

0 comments: